Nsnnews// (పోలీస్ జాగిలం) ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై చిన్నకోడూరు మండల కేంద్రంలో మరియు గుర్రాలగొంది, అనంతసాగర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది
చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ
ఈ సందర్భంగా చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ, మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది నార్కోటెక్ డాగ్స్ ద్వారా చిన్నకోడూరు మండల కేంద్రంలో, గుర్రాలగొంది, అనంతసాగర్ గ్రామాలలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొన్ని బ్లాక్ స్పాట్స్ లలో త్వరలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. అమ్మే వారిపై కొనే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠినంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు కలిగివున్న, రవాణా చేసిన, ఇతరులకు అమ్మిన ఎలాంటి సమాచారం డయల్ 100 లేదా చిన్నకోడూర్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Latest news,Telugu news,Narcotic Dogs ,Police Jagilam…