Nsnnews// బీడీ కార్మికులకు రూ,4016, జీవన భృతి కోసం భారి,ర్యాలి దోమకొండ తహసీల్దారు ఆపీసు ముట్టడి..
బీడీ కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలి
బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-బిఎల్ టీయూ
రాష్ట్ర అధ్యక్షులు -దండి వెంకట్ పిలుపు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది బీడీ కార్మికులకు షరతులు లేకుండా ,4016,రూ,లజీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా దొమకొండ మండల కేంద్రంలోని,భారీ ర్యాలి, తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ముట్టడి కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్- బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ది రాములు,యం, ఆంజనేయులు,, ఎఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు,వెంకట్ లక్ష్మీ అనుసూయ, కె.లింగం,
బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో వేలాదిమంది బహుజన కులాలకు చెందిన బీడీ కార్మికులు జీవన భృతి చెల్లించాలని ఆందోళనాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జరిగే ఉద్యమంలో బీడీ కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఎస్. సిద్ది రాములు మాట్లాడుతూ ఈరోజు బీడీ కార్మికులకు ఈ మాత్రం హక్కులు ఉన్నాయంటే అది బీడీ కార్మికుల సమర శీల పోరాటాల వల్లనే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయదల్చి ఇచ్చినవి కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరి 4016,రూ,ల జీవన భృతి ఇవ్వాలని లేనిచో స్ధనిక ఎన్నికలలో తగిన ముల్యాంచెల్లించుకోతప్పదు
అన్నారు
ఈ కార్యక్రమం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, నాయకులు, గంగదర్,నాంపల్లి, శంశు,దుర్గయ్య,యస్, రాంచేంద్రం,బుర్రి లింగం, లక్ష్మి నారాయణ, శంకర్, శివాజీ, సిద్దమ్మ,సుజాత,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
అనంతరం తహసిల్దార్ గారు బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవడం జరిగింది,
ఇట్లు
నగరపు యెల్లయ్య
రాష్ట్ర నాయకులు,
బిఎల్ టీయూ
Latest news, Telugu news, Telangana news, kamareddy news..