Nsnnews// తెలంగాణలో TDP బలోపేతానికి కృషి చేస్తానని.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని NTR ట్రస్ట్ భవన్‌లో… తెలుగుదేశం తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పార్టీ బలోపేతంపై వారితో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను.. రద్దు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలన్న ఆయన.. .ఆన్ లైన్‌లో సభ్యత్వం తీసుకొనే ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 15 రోజులకు ఒకసారి.. తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధినేతను సినీనటుడు బాబుమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Latestnews, Telugunews, Chandrababu, TDP Expansion, Hyderabad…