Nsnnews// మాదాపూర్ లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూలగొట్టిన ప్రాంతాన్ని సీపీఐ నేత నారాయణ పరిశీలించారు. నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించి.. రోజుకు లక్ష ఆదాయం ఆర్జిస్తున్నారని అన్నారు. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా.. రాజకీయ కక్షసాధింపు లేకుండా నిష్పక్షపాతంగా స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగించి.. ఎంఐఎం వారివి కూడా తొలగించాలని నారాయణ అన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు.
Latestnews, Telugunews, Hyderabad, Akkineni Nagarjuna,CPI leader Narayana Visit N Convention…