Nsnnews// కాకినాడ గ్రామీణ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ వైద్యుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వైద్యుడి ముఖానికి ఉన్న మాస్కు లాగేసి కొట్టడానికి చెయ్యెత్తారు. ఇంతలో ఆయన అనుచరులు వైద్యుడిపై చేయిచేసుకున్నారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల క్రీడామైదానంలో ఈఘటన చోటుచేసుకుంది. వైద్యకళాశాలకు చెందిన క్రీడామైదానంలో బయటి వ్యక్తులు వచ్చి వాలీబాల్ ఆడుతుంటడంతో.. తమకు ఇబ్బందిగా ఉందని వైద్య విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల ఫోరెన్సిక్ విభాగధిపతి ఉమామహేశ్వరరావుతోపాటు.. ఇతర వైద్యులు బయటి వ్యక్తులను రావొద్దని మందలించారు. అయినా సరే వారు వచ్చి కవ్వింపు చర్యలకు దిగడంతో స్వల్వ వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై బయటి నుంచి వచ్చిన వారు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో…పంతం నానాజీ అక్కడి వెళ్లి వైద్యుడు ఉమామహేశ్వరరావును అసభ్యపదజాలంతో దూషించారు.
Latest news,Telugu news,Andhra pradesh news,Crime news