Nsnnews// భారత్ , అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమిక్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదని.. ప్రధాని నరేంద్రమోడీ స్పష్టంచేశారు. అంతర్జాతీయ భద్రత,సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు క్వాడ్ మద్దతు ఇస్తుందన మోడీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై.. ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో..విల్మింగ్ టన్ లో క్వాడ్ సమావేశం జరుగుతోందన్నారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి..ముఖ్యమని వ్యాఖ్యానించారు. 2021లో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును… ప్రధాని గుర్తు చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు.. సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని పేర్కొన్నారు. 2025లో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం..సంతోషంగా ఉందని మోడీ చెప్పారు.
Latest news,Telugu news,National news