Nsnnews// పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి. రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనే చేపలు మృతి చెందినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారు. కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేత నీలం మధు సొంత గ్రామం కావడంతో అతనికి ఫోన్ చేసిన సంఘం నాయకులు, నేను అందుబాటులో లేనని అధికారులకు చెప్తానని అన్నట్టు సంఘం నాయకులు తెలిపారు.
Latest news,Telugu news,fish died…