Nsnnews// హైదరాబాద్: మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. వారిని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి కమిషన్ ముందు కీలక అంశాలను ప్రస్తావించారు. డిజైన్లు, డ్రాయింగ్‌లకు ఫైనల్ అప్రూవల్‌కు తాను మొదట సంతకం చేయలేదని తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. త్వరగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావుడిగా అన్నీ అప్రూవల్ చేశామన్నారు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు ఎల్‌అండ్‌టీ సంస్థ పాల్గొందని తెలిపారు.
‘‘ప్రాజెక్టు నిర్మాణ సంబంధ చర్చల్లో నేను పాల్గొనలేదు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే తప్పిదాలు జరిగాయి. ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా చేయలేదు. బ్యారేజీ నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సరిగా చేయలేదు’’ అని నరేందర్‌రెడ్డి తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,Hyderabad News