Nsnnews// TG: ఇంటర్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా 63.86% ఉత్తీర్ణత నమోదైంది. 70.26% బాలికలు, 58.39% బాలురు పాసయ్యారు. 1,38,477 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగా 43.77% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 47.54%, బాలురు 41.37% మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040 24655027కు కాల్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
Latest news,Telugu news, Inter Supplementary/Improvement exam results…