Nsnnews// ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 80,143 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 24,360 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 సూచీలో మారుతీ, ఎం అండ్ ఎం, టైటన్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. అక్కడినుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 85.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.61 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.2,867 కోట్ల వాటాలను కొన్నారు.
Latest news,Telugu news,Business News, Nifty ,Sensex ,Stock Market…