Nsnnews// సిద్దిపేట పెద్ద కోడూర్ గ్రామ శివారులో ఉన్న సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి వీక్లీ పరేడ్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు ,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. మరియు రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.మరియు సమయం దొరికినప్పుడు భార్యా పిల్లలతో ఉల్లాసంగా గడపాలని సూచించారు. మరియు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు. సర్వేసుకు సంబంధించిన మరియు వ్యక్తిగతంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, ధరణి కుమార్, రాజేష్, విష్ణుప్రసాద్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, విద్యాసాగర్, ఉపేందర్ మరియు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Telangananews, parade…