Home Blog Page 7

లింగ నిర్ధారణపై విచారణ జరుగుతుంది.డి.ఎం.హెచ్.ఓ || Investigation will be done on gender determination.DMHO

 

Nsnnews// లింగ నిర్దారణపై విచారణ కొనసాగుతుందని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు.సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ నెల 25 న రెండు స్కానింగ్ మిషన్లను సీజ్ చేసిన విషయంలో విట్టం నడిపి సిద్దిరాములు, ఆయన దగ్గర పనిచేసే పృథ్విలకు నోటీసులు జారీ చేశామన్నారు.సీజ్ చేసిన ఒక మిషన్ సిద్దిరాములు కొడుకు డా.ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉందని,మరొక మిషన్ ఎవరి పేరున ఉందో విచారణ చేస్తున్నామని తెలిపారు.లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ మిషన్లను ఉపయోగించాల్సి ఉందని పేర్కొన్నారు.రాజంపేటలో లింగ నిర్దారణ ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు.సిద్దిరాములు వద్ద పనిచేసిన వాళ్లే మొబైల్ టీంగా ఏర్పడి ఇళ్లలో లింగనిర్దారణ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు.లింగ నిర్దారణ కట్టడి విషయంలో తమ శాఖలో ఎలాంటి లోపం లేదని,ప్రజల్లో అవగాహన వస్తే తప్ప దీనిని కట్టడి చేయలేమని తెలిపారు.డా.సిద్దిరాములపై నమోదైన కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ తాను ఆ సమయంలో లేనని తెలిపారు.గతంలో కేసులు నమోదు చేసి సమన్విత ఆస్పత్రిని సీజ్ చేస్తే చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని రిలీజ్ చేసుకున్నారని తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ సుమిత్ర నాయక్,పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Latest news, Telugu news, Telangana news, kamareddy news..

ప్రాంతీయ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో గందరగోళం.. || Confusion in Regional ring road alignment..

 

Nsnnews// రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు. ఉత్తర రింగు రోడ్డు చౌటుప్పల్ వద్ద ముగుస్తుండడంతో, చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్చేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది.. కానీ ఇక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉండడంతో, ప్రభుత్వం భూముల విలువ తక్కువగా కట్టించి ఇవ్వడంతో, ఈ ఇంటర్చేంజ్ స్ట్రక్చర్ ను చౌటుప్పల్ పట్టణానికి దూరంగా నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కొందరు నేతలు కలిసి ఒత్తిడి తెచ్చారు.

మరోవైపు సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద RRR ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉండగా, రైతులు భూములు ఇవ్వడం లేదు.. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నేతలు తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగ్ రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో అలైన్‌మెంట్ మార్చాలని ప్రతిపాదనలు తెస్తున్నారు. యాదాద్రి జిల్లాలో రింగ్ రోడ్డు గురించి రైతులు భూములు ఇవ్వమని భూసేకరణను అడ్డుకుంటున్నారు.. దీంతో కొందరు నేతలు రైతుల భూముల్లో నుండి RRR వెళ్లొద్దని అలైన్‌మెంట్ మార్చమని ప్రతిపాదిస్తున్నారు….

Latest news, Telugu news, Telangana news..

కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా.. || Farmers’ dharna in front of the Collectorate..

 

Nsnnews// భద్రాద్రి కొత్తగూడెం – రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకంలో భాగంగా అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని.. రైతు భరోసా పథకం రెండు పంటలకు వర్తింపచేయాలని కోరుతూ సీపీఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా…

Latest news, Telugu news, Telangana news, Farmers’ dharna in front of the Collectorate..

బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలిసుల అరాచకం.. || Police anarchy on battalion constables..

 

Nsnnews// కష్ట పడి ఉద్యోగం తెచ్చుకున్న 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.. 10 మందిని ఉద్యోగం నుండి తీసేసారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డే వంద సార్లు అన్నాడు ఏక్ పోలీస్ చేస్తానని.. ఇప్పుడు మమ్మల్ని కనీసం కలవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ మమ్మల్ని ఒకసారి పిలిచి మాతో చర్చలు జరగపాలని డిమాండ్ చేస్తున్నాం – బెటాలియన్ కానిస్టేబుల్…

Latest news, Telugu news, Telangana news, Police anarchy on battalion constables..

హైడ్రాతో భారీగా తగ్గిపోయిన గృహాల కొనుగోళ్లు || Heavily discounted home purchases with HYDRA

 

Nsnnews// గత సంవత్సరం అక్టోబర్ కంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 24% తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడి. ఇండ్లు కొనడానికి భయపడుతున్న ఎన్ఆర్ఐలు. గతేడాది అక్టోబర్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల నుండి రూ.1221.82 కోట్లు ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ.923.30 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రూ.1161.54 కోట్లు ఆదాయం రాగా.. గత నెలలో రూ.857.83 కోట్లు మాత్రమే వచ్చింది..

Latest news, Telugunews, Telangana news, Hydra demolisions, Illegal constructions..

25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత || 25 Gurukula female students are ill

 

Nsnnews// మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత. మంథని,ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత. విద్యార్థినులకు తీవ్రంగా దగ్గు రావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టు అనుమానం…

Latest news ,Telugu news ,Telangana news, Gurukula Students Incident…

బెటాలియన్ కానిస్టేబుల్లను డిస్మిస్ చేసిన రేవంత్ సర్కార్ || Revanth Sarkar dismissed the battalion constables

 

Nsnnews// ఆందోళన చేసిన మరో 10 మంది బెటాలియన్ కానిస్టేబుల్లను డిస్మిస్ చేసిన రేవంత్ సర్కార్. ఆందోళన మరింత ఉద్ధృతం చేసే ఆలోచనలో బెటాలియన్ కానిస్టేబుల్స్. దీంతో నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం…

Latest news, Telugu news, Telangana news..

రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన తమ్మినేని వీరభద్రం.. || Tammineni Veerabhadra who set fire on Revanth Reddy..

 

Nsnnews// రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం..ఇక నుండి రోడ్ల పైకి వస్తాం అంటూ హెచ్చరిక. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు అంటూ తమ్మినేని హాట్ కామెంట్స్..

Latestnews, Telugu news, Telangna news, Tammineni veerabhadram..

చైనాలో భారీ సంక్షోభం.. పాఠశాలలు మూసివేత… || Huge crisis in China.. schools closed…

 

Nsnnews// చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్‌ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20లక్షలు తగ్గినట్లు అంచనా. 2023లో దేశవ్యాప్తంగా 90లక్షల జననాలు నమోదయ్యాయి.. 1949 నుంచి ఇంత తక్కువగా నమోదవ్వడం అదే తొలిసారి.

జనాభా పరంగా చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

Latest news, Telugu news, China, Huge crisis, schools closed..

హైదరాబాద్ లో 144 సెక్షన్… || Section 144 in Hyderabad…

 

Nsnnews// తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రాజధాని హైదరాబా ద్ నగరంలో నేడు 144 సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చింది ఇందు కోసం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో కఠిన నిబంధనలను ఉంటాయని పోలీసు శాఖ నోటీసులను జారీ చేసింది. ఈ 24 గంటల్లో ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ఆందోళనలను చేపట్ట కూడదని హెచ్చరించింది. అలా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బామ్మర్థి ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని..కేటీఆర్ బామ్మర్ది సోదరుడికి చెందిన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ దగ్గర పోలీసులు నిర్వహించిన నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తారని పోలీసు శాఖ ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Latest news, Telugu news, Telangana news, Hyderabad news..