Home Blog Page 5

వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులకు సద్వినియోగం చేసుకోవాలి || Farmers should take advantage of wood purchase centers.

 

Nsnnews// సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డి పేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించరు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ రైతులు అపోహలు నమ్మొద్దు వడ్లు కొనుగోలు విషయంలో మిల్లర్రలను కూడా జవాబుదారీతనాన్ని ఉండాలని కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రభుత్వంలో రైస్ మిల్లర్ల అవకతవకాలను ప్రక్షాళన చేస్తుంది దళారి వ్యవస్థ నమ్మొద్దు అదేవిధంగా గత పాలకులు రైతులకు వ్యతిరేక విధానాల అమలు చేస్తూతుంది వరి వేస్తే ఉరి అని చెప్పారు.సన్న రకం వరి వద్దు అన్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాళ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనసు సిస్తున్నాం గత పాలకులు లక్ష రుణమాఫీ చేశారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల మాఫీ చేసింది గతంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది అని గతంలో రైతు భరోసా కొండలకు, గుట్టలకు కోళ్లఫారాలకు ఇచ్చిన చరిత్ర మీది, రైతు భరోసా కూడా ఎవరికి ఇవ్వాలని రైతు భరోసా ప్రక్షాళన మొదలైంది అదేవిధంగా ఈ డిసెంబర్ లో కూడా పూర్తిస్థాయిలో రెండు లక్ష రుణమాఫీ జరుగుతుంది పది సంవత్సరాలు అమలుగాని హామీలు నెరవేర్చలేదు మీరు 10 నెలల మేము ఎలా చేస్తామని ప్రజలు ను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మూడు నెలల ముందే మద్యం టెండర్ వీళ్ళ పడేసి 1000 కోట్లు ఇంచుమించు కడగ నాకేశారు. ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి రుసుము గురించి మీరు ముందే టెండర్లు వేసుకొని ఆ డబ్బులు కూడా కజేశారు మీరు గతంలో అమలుగాని హామీలు యేవి అయితే ప్రజలకు నెరవేర్చరా?

దళిత ముఖ్యమంత్రి చేస్తాం చేసిర్రా? హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తానని చేసిర్రా? కరీంనగర్ లండన్ చేస్తాం అని చేసిరా? గతంలో మీరు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిన హైకోర్టు మెట్లు ఎక్కనీ ఒక్క నోటిఫికేషన్ ఉన్నదా? అది ఉందంటే కేవలం మద్యం టెండర్లు. మేము నోటిఫికేషన్లు గతంలో మీరు ఇచ్చినవి కూడా సమస్యలు పరిష్కరించి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశ కల్పించిన చరిత్ర మాది ప్రజలను తప్పుదోవ పట్టియద్దు ప్రజలు కొంచెం ఓపికతో సహనం తో ఉండాలి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నము. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి. ప్రభాకర్ చారి. బ్యాగారి నవీన్. బోయిని పర్శరాములు మహిపాల్ యాదవ్ మాష్టి సిద్ధిరములు మ్యాదరి కిషోర్ ఎర్రోళ్ల బాలు కాళిదాసు బాలరాజు రాజు భాను తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangana news, Siddipet news..

రష్యా అణ్వస్త్ర పరీక్షలు – నాటో అప్రమత్తం || Russia’s Nuclear Tests – NATO Alert

 

Nsnnews// రష్యా మూడు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి అంతర్జాతీయంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ పరీక్షల్లో రెండు రాకెట్లు జలాంతర్గామి నుంచి ప్రయోగించగా, మరో రాకెట్‌ను భూ ఉపరితలం నుంచి పరీక్షించారు. ఈ చర్యలపై నాటో అప్రమత్తమవగా, రష్యా ఈ పరీక్షలు తమ రక్షణ సత్తా ప్రదర్శనలో భాగమని పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా శక్తి ప్రదర్శన పై ప్రపంచ దేశాలు మిశ్రమ స్పందన కనబరుస్తున్నాయి. రెండు రాకెట్లను జలాంతర్గామి నుంచి, ఒక రాకెట్‌ను భూమి ఉపరితలం నుంచి ప్రయోగించిన రష్యా ఈ పరీక్షలు తమ రక్షణ సామర్థ్యాన్ని బలంగా ప్రకటిస్తున్నాయని వెల్లడించింది. దీనితో నాటో దేశాలు అప్రమత్తమవ్వగా, రష్యా అణ్వస్త్ర సత్తాపై మళ్లీ చర్చ మొదలైంది.
ఈ తాజా అణ్వస్త్ర పరీక్షలపై నాటో సిబ్బంది అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతూనే, రష్యా నుంచి మరో శక్తి ప్రదర్శన వస్తుండటంతో యూరప్ సహా ఇతర దేశాలు స్పందనను వెల్లడిస్తున్నాయి. రష్యా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చేసిన ఈ పరీక్షలు శాంతి భద్రతపై ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశంపై ఇప్పుడు ప్రపంచం దృష్టి సారించింది.

Latest news, Telugu news, International news, Russia’s Nuclear Tests – NATO Alert..

విద్యుత్ చార్జీల భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ సంబరాలు.. || BRS celebrations at Kamareddy district center for success in stopping the burden of electricity charges..

 

Nsnnews// 18 వేల 500 వందల కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ సంబరాలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన వేయాలనుకున్న 18 వేల 500 వందల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి BRS పార్టీ జిల్లా అద్యక్షులు ముజిబోద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రజల తరఫున ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పాఠకులు, భానసంచలు కాల్చి సంబరాలు చేసుకున్న కామారెడ్డి నియోజకవర్గ BRS పార్టీ ప్రజాప్రతినిధులు, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు.

పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని BRS ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోపు 18 వేల 500 వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఈఆర్సిని ఒప్పించగలిగామని మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షం యొక్క వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని సంపూర్ణంగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్ సి తిరస్కరించడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకం అన్నారు. రాష్ట్ర ప్రజల పైన అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈ ఆర్సి ముందు ఉంచడంలో విజయం సాధించామన్నారు. పార్టీ అధినేత కేసిఆర్ గారి ఆదేశాల మేరకు స్వయంగా తనతో పాటు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు రాష్ట్ర ఈఆర్సీనీ కలిసి విద్యుత్ చార్జీల పెంపును ఆపాలని కోరారాని, ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారీ పాల్గొని ప్రజల తరఫున వాదనలను గట్టిగా వినిపించారన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ ,కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.

Latestnews, Telugunews, Telangana news, Kamareddy news..

అగ్నిమాపక జిల్లా అధికారి ఆధ్వర్యంలో ప్రజలకు పలు సూచనలు || Various instructions to the public under the direction of the Fire District Officer

 

Nsnnews// కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.మొదటగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం అగ్నిమాపక జిల్లా అధికారి సుధాకర్ మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలను సూచనలను పాటించాలని తెలియజేశారు టపాసులు కొనే సమయంలో నాణ్యత గల టపాకాయలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు.మరియు లైసెన్స్ దారుల వద్ద నుండి కొనుగోలు చేయాలని టపాసులు ప్రజల మధ్యలో కాకుండా కాళీ స్థలములో మాత్రమే టపాసులు కాల్చాలని సూచించారు టపాసులు కాల్చేటప్పుడు ముందుగా చిన్న పుల్లలు జాగ్రత్తలు పాటించాలని బకెట్లో నీటిని దగ్గర ఉంచుకొని టపాసులు కాల్చాలని తప్పనిసరిగా కాటన్ దుస్తులు ధరించాలని కుటుంబ పెద్దల సమక్షంలో పిల్లలు టపాసులు కాల్ చేయాలి తెలియజేశారు.పిల్లలు జాగ్రత్తలు ఒకసారి కాల్చిన టపాసులు మళ్లీ కాల్చకూడదని టపాసులు ఒకదాని తర్వాత ఒకటి కాల్చాలని టపాసులు కాల్చేటప్పుడు సురక్షితంగా దూరం పాటించగలరని తెలియజేశారు.మరియు ఇంటిలోపటల టపాసులు కాల్చకూడదని మరియు మండే స్వభావం గల పదార్థాల వద్ద టపాసులు కాల్చవద్దని పేలని టపాసులు మళ్లీ కాల్చకూడదని ఒకవేళ టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా సంభవాలు జరిగితే వెంటనే సంబంధిత ఆస్పత్రిని సందర్శించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ మహమ్మద్ అలీ మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Latest news, Telugunews, Telangana news, Kamareddy news, The fire officer has several instructions..

SFI ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫీజు దీక్ష || Fee initiation at Kamareddy district center under SFI

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షను ప్రముఖ న్యాయవాది క్యాతం సిద్ధిరాములు, టి పి టి ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ , సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ , సిఐటియు నాయకులు వెంకట్ గౌడ్ , తెలంగాణ రైతు సంఘం నాయకులు మోతి రామ్ నాయక్ , వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొత్త నరసింహులు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ : విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయలేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. సుమారు రాష్ట్రంలో 8300 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ లను ప్రభుత్వం చెల్లించ లేకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడుపుకోలేని పరిస్థితి వచ్చిందని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల జీతాలు ఆపలేని రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థుల స్కాలర్షిప్లను ఎందుకు పెండింగ్లో పెట్టింది అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే స్కాలర్షిప్ల ను ఇవ్వకపోవడం అని ధ్వజమెత్తారు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు దీక్షలో కూర్చున్నవారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదాం అరుణ్ , ఎస్ అజయ్ జిల్లా నాయకులు , మణికంఠ , సమీర్ , రాహుల్ , నితిన్ , సాయి , నవీన్ , శివతేజ , సాయి ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

నిజామాబాద్ జిల్లా శివాజీ నగర్ లో రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆఫిస్ బేరర్స్ సమావేశం || Office bearers meeting held at the state office in Shivaji Nagar, Nizamabad district

 

Nsnnews// తెలంగాణ,బహుళజన బీడీ కార్మిక సంఘం ,బిఎల్ టీయూ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నాగరపు ఎల్లయ్య, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్- బిఎల్ టీయూ అనుబంధ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూరాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాగరపు ఎల్లయ్య ను ఎన్నిక చేసినట్లు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.సిద్దిరాములు ప్రకటించారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీ నగర్ లో గల రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆఫిస్ బేరర్స్ సమావేశం జరిగింది,ఈ సమావేశంలో ఎన్నిక చేసినట్లు ప్రకటించారు. నాగారపు ఎల్లయ్య గత ముప్పై సంవత్సారాలుగా సుదీర్ఘకాలంగా కార్మికోద్యమంలో పని చేస్తున్న ఎల్లయ్య 99% బహుజన కార్మిక వర్గ పోరాటాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న వ్యక్తి నగరపు యెల్లయ్య, అతని కృషి కార్మిక వర్గం కు ఎంతో అవసరం అందుకని యెల్లయ్య ను తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నుకోవడం కార్మికులు అదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.జగదీష్ ,రాష్ట్ర కోషదిగారి ,యస్,డి,స్తెయ్యద్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews, Politicalnews…

భారీ అగ్నిప్రమాదం బాలికకు తీవ్ర గాయాలు, భార్యాభర్తలు మృతి || A huge fire caused serious injuries to the girl and the death of the husband and wife

 

Nsnnews// భారీ అగ్నిప్రమాదం.. బాలికకు తీవ్ర గాయాలు, భార్యాభర్తలు మృతి. హైదరాబాద్‌ – యాకుత్‌పురాలో ఓ భవనంలో అమ్మకానికి పెట్టిన టపాసులు వల్ల మంటలు వ్యాపించి సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మోహన్ లాల్ (55), అతని భార్య ఉష (50) మరణించగా మరో బాలిక శృతి(15) తీవ్రంగా గాయపడడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Latestnews, Telugunews, Hyderabadnews, fire accident…

రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు || Revanth Reddy became the CM because of what we did

 

Nsnnews// మంత్రి శ్రీధర్ బాబు ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన మారు గంగారెడ్డి సోదరి రాధ. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు. గత గవర్నమెంట్‌లో మంచిగా ఉన్నాం.. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం అంటూ మండిపడ్డ హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి సోదరి రాధ.

Latest news, Telugu news, Telangana news, politicalnews…

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు || Even though it has been a year since the Congress government was formed, not a single ration card has been issued

 

Nsnnews// కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు! కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇంకా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడంతో ప్రజల అసహనం. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా రేషన్ కార్డుల మాట ఎత్తక పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలను రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తామని చెప్పడంతో కొత్త కార్డులు లేని వాళ్లు ఆ పథకాలను అందుకోలేక పోతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసున్నారు.

Latestnews, Telugunews, Telangananews, Politicalnews…

కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జేబులు నింపుకుంటున్నారు || Congress ministers and leaders are filling their pockets

 

Nsnnews// రుణమాఫీ పైసలు, 4 వేలు పెన్షన్, మహిళలకు ఇస్తానన్న రూ.2500, ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ. 12 వేలు, రైతుకూలీలకు ఇస్తానన్న రూ. 1000, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు రావాల్సిన తులం బంగారం ఇవ్వన్నీ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల జేబులోకి పోతున్నాయి.. అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గింది.

Latestnews, Telugunews, Telangananews, Jagadish Reddy…