Home Blog Page 4

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆసరాగా నిలిచిన తోట కమలాకర్ రెడ్డి || Thota Kamalakar Reddy who supported the family who died due to illness

 

Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిన్న అర్ధరాత్రి ఎర్రోళ్ల ముత్తయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ముత్తయ్య గ్రామపంచాయతీలో కొన్ని సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా పని చేశారు. అనారోగ్యంతో నిన్న అర్ధరాత్రి చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఏదైనా ఆపద వచ్చిన నాకు ఒక చిన్నమాట చెప్పిన నేను వచ్చి ఆదుకుంటానని ఆయన అన్నారు.

Latest news, Telugu news, Telangana news, Siddipet news…

 

 

న్యాయం చేయాలంటూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు || Parents of a student who committed suicide to seek justice

 

Nsnnews// న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నించిన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో కలుస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈస్ట్ గోదావరి జిల్లా చెముడు లంక గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల, షిరిడి సాయి విద్యానికేతన్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, చనిపోయిన తమ కూతురికి న్యాయం చేయాలని చెక్కపల్లి వెన్నెల తల్లిదండ్రులు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. తిరుగు ప్రయాణంలో వారిని కలిసి మాట్లాడి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు వెన్నెల తల్లిదండ్రులు తెలిపారు.

Latestnews, Telugunews, Apnews, pawan kalyan…

అనంతపురం జిల్లా: కలెక్టరేట్ లో ఘోరం జరిగింది || Anantapuram District: There was a tragedy in the Collectorate

 

Nsnnews// శుక్రవారం తెల్లవారుజామున గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతన్ని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం సుబ్బరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Latestnews, Telugunews, Apnews…

నల్గొండ రైతుల కష్టాలు || The hardships of Nalgonda farmers

 

Nsnnews// ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో బయట అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు లారీల కొరత కారణంగా కాంటా వేయకపోవడంతో, కట్టంగూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లలో అమ్ముకునేందుకు తిరిగి తీసుకెళ్తున్న రైతులు.

Latestnews, Telugunews, Telangananews, Nalgondanews…

ఇందిరా గాంధీ 40వ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు || Congress party leaders pay tributes to Indira Gandhi on her 40th death anniversary

 

Nsnnews// మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 40వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 40వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల ఉపాధ్యక్షుడు ముత్తంగి భూమయ్య, ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, చాట్లపల్లి బాల గౌడ్,ఎస్సీ సెల్ మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, సేవాదళ్ మండల అధ్యక్షుడు పాతూరి భూపాల్ రెడ్డి, ఫిషర్ మెన్ మండల అధ్యక్షుడు అన్నబోయిన చంద్రశేఖర్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పల్లె అనిల్,తాజా మాజీ సర్పంచ్ పోతారం అనసూయ ప్రతాప్, మాజీ టెలికం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు బాల్తే వెంకటేషం, తాళ్ల అంజాగౌడ్ , అబ్బుల మమ్ము గౌడ్,అక్బర్ పేట గ్రామ అధ్యక్షుడు కూతురి చందు, భూంపల్లి గ్రామ అధ్యక్షుడు ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, తాళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి ముదిరాజ్, చిట్టాపూర్ గ్రామ అధ్యక్షుడు రెడ్డి బాల నర్సింలు, మంతూరి బాబు,సిద్ధిని రాజు, ఎదురు బాలరాజు, పర్స జై, జంగి బిక్షపతి, జీడిపల్లి రమేష్, నగరం నారా గౌడ్, ఉద్ధమారి నవీన్,కడవెరుగు నగేష్, మండల నరసింహులు, బుల్లు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Siddipetnews…

ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న బీటెక్ విద్యార్థులు || BTech students attacked each other

 

Nsnnews// ప్రకాశం – మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధుల మధ్య ఘర్షణ రహదారి పై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఏ1 గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజీరింగ్ కళాశాలల విద్యార్థులు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latestnews, Telugunews, Apnews…

మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం || Drunk TDP leader Veeranga

 

Nsnnews// నరసరావుపేట టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు. అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు. ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latestnews, Telugunews, Telangananews, Politicalnews…

KBR పార్క్ వద్ద కారు బీభత్సం || Car accident at KBR Park

 

Nsnnews// హైదరాబాద్ – బంజారాహిల్స్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి KBR పార్క్ వైపు వెళుతున్న పోర్షే కారు అతివేగంతో మూలమలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. పరారీలో ఉన్న డ్రైవర్.. కారుకు ఎలాంటి నంబర్ ప్లేట్ లేదని గుర్తించిన పోలీసులు.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…

వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత || Heavy drug seizure at doctor’s house

 

Nsnnews// హైదరాబాద్ – చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులు. పక్క సమాచారంతో ఆ ఇంటి పై దాడులు జరిపిన చందానగర్ పోలీసులు. రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేసిన పోలీసులు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…

“రహదారి భద్రత జీవితానికి రక్షణ” జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి || “Road safety is the protection of life” District Collector M.Manu Chaudhary

 

Nsnnews// కలెక్టర్ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ డా.అనురాధ తో సంబంధిత శాఖల అధికారులతో డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశ నిర్వహించి జిల్లాలో రహదారి భద్రతపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ, రాష్ట్ర ఇతర అన్ని రకాల రహదారులలో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా నివారించేందుకు తగు భద్రత చర్యలను తీసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖ వారితో కలిసి ఆర్ అండ్ బి మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లాలోని జాతీయ రహదారులు మరియు ఇతర ప్రధాన రహదారులను కలిపే ప్రాంతాలలో ఆయా శాఖల రహదారులను పరిశీలించి స్పీడ్ బ్రేకర్లు లేని వద్ద కచ్చితంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. రహదారుల్లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రమాద సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గుంతలను పూడ్చాలని అన్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రహదారి పనులు జరుగుతున్న ప్రాంతాలలో వాహనదారులు ఇబ్బంది పడకుండా డైవర్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, రాజీవ్ జాతీయ రహదారిపై బ్లింకింగ్ లైట్లు అన్ని పనిచేసేలా చూడాలని, రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన మొక్కల కొమ్మలను కత్తిరించి తొలగించాలని, దుద్దెడ, కుకునూరుపల్లి, గౌరారం, వంటిమామిడి గ్రామాల వద్ద ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా రెయిలింగ్ సీడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నిబంధనల మేరకే రహదారుల నుండి నిర్దేశిత దూరం పాటించి వైన్ షాప్ లు ఉండేలా చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలలో ప్రయాణికులు దిగడానికి మరియు ఎక్కడానికి ఆర్టీసీ బస్సులను కచ్చితంగా రోడ్డుకు ప్రక్కననే ఆపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ప్రయాణికులు వాహనదారులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండడం మూలంగా రహదారి ప్రమాదాలను నివారించవచ్చని పోలీస్ శాఖ వారు సూచించే నియమ నిబంధనలను డ్రైవర్లు తప్పక పాటించాలని అన్నారు. రోడ్లను దాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రయాణికులకు, వాహనాలు నరిపేట తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుటకు అందరు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. అన్ని పాఠశాలలలో గల యాంటీ డ్రగ్ కమిటీలు విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన చర్యలు చేపట్టాలని అన్నారు. మద్యపానం, ధూమపానం ఇతర డ్రగ్స్ కు అలవాటయినా ప్రజలను గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గల డి అడిక్షన్ సెంటర్కు పంపి చికిత్స అందించాలని అన్నారు. మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రలితాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట సబ్ జైల్లో లో ఖైదులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మరియు వారికి కలిగిన హక్కులు, న్యాయ సహాయం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాస్ మూర్తి, జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు, ఏసీపిలు మధు, పురుషోత్తం, సతీష్, సుమన్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, మురళి, కోర్ట్ మానిటర్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, జైల్స్, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest news, Telugunews, Telangananews, Siddipet news..