Nsnnews// కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కుల గణన సమగ్ర కుటుంబ సర్వే పై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ , హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ,మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేష్ ఇతర కాంగ్రెస్ నేతలు.. సమగ్ర కుల గణన ఇంటింటి సర్వే ఆవశ్యకత ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ జిల్లా కాంగ్రెస్ నేతలు కుల గణన చేసే ఎన్రోల్మెంట్ అధికారులతో ప్రతి ఇంటికి గడప కి వెళ్లి చెప్పాల్సిన అంశాల పై కార్యకర్తలకు వివరించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ పరిధిలో ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు ప్రతి అంశం పై మాట్లాడుకుందాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో 33 జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖ మంత్రి గా కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్న. కామారెడ్డి డిక్లరేషన్ లో కుల గణన చేసి బీసీ రిజర్వేషన్ల సంఖ్య పెంచుతామని చెప్పాం. పిబ్రవరి 4 న కుల గణన పై క్యాబినెట్ తీర్మానం చేసింది. ఫిబ్రవరి 15 న శాసన సభ లో మీ కరీంనగర్ బిడ్డ గా తీర్మానం పెట్టిన తరువాత 150 కోట్లు కేతాయించిది. నిరంజన్ చైర్మన్ గా ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్లానింగ్ కమిషన్ కు అప్పగించింది. టీచర్ల తో కూడా ఈ సర్వే నిర్వహించాలని జీవో ఇచ్చింది. రాష్ట్రంలో 80-90 వేల వరకు క్షేత్ర స్థాయి వరకు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తారు. ప్రతి ఒక్కరికీ 150 ఇల్లు వివరాలు సేకరిస్తారు. 56 ప్రశ్నలతో ఒక ప్రశ్నపత్రం తయారు చేశారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 70 వేల ఇళ్లకు 2500 మంది సర్వే చేస్తారు. ప్రభుత్వం నుండి సర్వే చేస్తున్న అధికారులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇతర నేతలు ఒక టీం గా ఏర్పడి ఇందిరమ్మ కమిటీ ,బీసీ సెల్ ,ఎస్సి సెల్ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి ఎన్యుమారెట్స్ కి అండగా వెళ్లి కుటుంబాలకు కుల గణన సర్వే పై చెప్పాలి.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమం చేపడతాం అని చెప్పాలి. ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి మన నాయకుడు రాహుల్ గాందీ ఇచ్చిన హామీ దీని వల్ల అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పాలి. కుల గణన మన బాడి కి ఎక్స్ రే లాగ ప్రజలకు న్యాయం చేయడానికి పని చేస్తుంది. Brs పార్టీ అధ్యక్షుడు ,కార్యనిర్వహక అధ్యక్షుడు ,శాసన సభా ప్రతిపక్ష నేత వారి కుటుంబ సభ్యులే.. అందులో ఒక పదవి బీసీ లకు ఇవ్వండి. ఇంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఎదుటి వారు brs,bjp నేతలు మన పార్టీ మీద దాడి చేస్తే మూకుమ్మడిగా కలిసి ఎదురు దాడి చేయాలి. మన పార్టీ నీ ఎదుటి వ్యక్తులు తిడితే తల్లిని తిట్టినట్టుగా భావించాలి. గ్రామాల్లో ఎవరికి తలవంచుకుని అవసరం లేదు. Brs, బీజేపీ నేతలను గ్రామాల్లో గట్టిగా నిలదీయాలి. లక్ష రూపాయల రుణమాఫీ ఐదు సంవత్సరాలు చేశారు . మేము లక్ష ,లక్ష 50 వెలు ,2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేశాం. 2 లక్షల పైన ఉన్నవారికి కూడా రుణమాఫీ చేస్తం పైన ఉన్న అప్పు కట్టుకుంటే 2 లక్షల జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రైతు రుణమాఫీ చేశామని గ్రామాల్లో రచ్చబండ దగ్గర బల్లగుద్ది చెప్పాలి. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ,10 లక్షల ఆరోగ్య శ్రీ ,500 కి గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ రాకపోతే mpdo ఆఫీస్ కి వెళ్లి పిర్యాదు చేయండి. వాళ్ళకి అవి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ది. ప్రతి నియోజకవర్గానికి ఇల్లు లేని పేదలకు 3500 ఇల్లు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం ది. బండి సంజయ్ గారు తెలంగాణ కు ఏం తెచ్చారు..తెలంగాణ కు ఒక్క రూపాయి కేటాయించలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..రైతు నల్ల చట్టాలు తెచ్చారు. తెలంగాణ భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగితే ఎస్టిమేషన్ చెప్తే బిచ్చం లాగ వేశారు. బండి సంజయ్,కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పాలి. మంచైనా చెడైనా ఈ జిల్లా మంత్రిగా నాదే బాధ్యత. మీకు అండగా ఉంటాం..పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది ఎవరు అధైర్య పడవద్దు. ఈ జిల్లా నుండి కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేలుగా ఉన్నారు..పోటీ చేసిన ప్రణవ్,శ్రీనివాస్ అన్నారు. గతంలో వాళ్ళు దోపిడీ చేశారు. ఈ ప్రభుత్వ ఉద్దేశ్యం దోపిడీ కాదు. ఎక్కడ అవినీతి జరిగిన చర్యలు తీసుకునే సానుకూల వాతావరణం కల్పిస్తున్నాం. ఇది చరిత్ర లో నిలిచిపోయే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం అవుతుంది. ఇందులో పాల్గొనడం మన అదృష్టం ఒక చారిత్రాత్మక ఘటనలో మన భాగస్వామ్యం అవడం చరిత్రలో ఉంటుంది. నా 150 ఇళ్లకు సక్రమంగా సమాచారం అందించడానికి నా కృషి ఉంటుందని అందరూ భావించాలి. ప్రతి ఒక్కరూ గురుకుల హాస్టల్ కి వెళ్లి స్విట్లు పంచి విద్యార్థులతో సంబరాలు చేసుకోండి. 10 సంవత్సరాలుగా మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచింది .విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పిస్తున్నాం. గురుకుల అద్దె బకాయిలు 50 శాతం చెల్లించాం.. దసరా తరువాత గెట్లకు తాళాలు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించాం. కుల గణన ద్వారా ఎవరికింతో వారికి అంత న్యాయం జరగాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ముందుకు పోవాలి..
ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలుగా తిరిగండి ప్రజల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే వారి దగ్గర నుండి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించండి. నాలుగైదు రోజుల్లో నియోజకవర్గల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుంటా.
Latest news, Telugu news, Telangana news, Political news, Minister Ponnam Prabhakar..