Home Blog Page 2

పేదింటి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల అందజేత || Uppala Srinivas Gupta who showed humanity

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కిభగవతి భగవాన్ ఆలయంలో పేదంటి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేసిన పుస్తె,మట్టేలను లను గుర్రాల సుజాత స్వామి ల కుమార్తె కళ్యాణికి,లింగంపల్లి పుష్ప శివకుమార్ ల కుమార్తె శివాని లకు ఆలయ దాసాజీ ప్రణయజి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల కుటుంబ సభ్యులు వారి పెళ్లిళ్ల కోసం పుస్తే,మట్టేలు కావాలని అడగడంతో ఈ విషయాన్ని ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు తెలియజేయడంతో వెంటనే స్పందించి పుస్తే,మట్టేలను అందజేయడం జరిగిందని అన్నారు.కులం,మతం అనే తేడా లేకుండా పేదింటి ఆడపిల్లలకు సహకారాన్ని అందజేస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.ఇప్పటివరకు 7000 మంది ఆడపిల్లల పెళ్లిలకు పుస్తె,మట్టేలను అందజేయడం సాధారణ విషయం కాదని,నేటి సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుందని ఆ డబ్బులు పేదవారికి, ఆపదలో ఉన్నవారికి అందజేసే మంచి మనసు కొందరికి ఉంటుందని అలాంటి కొందరు వ్యక్తుల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒకరిని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ దాసాజీ ప్రణయజి,కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్,జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్ గుప్త లు పాల్గొనడం జరిగింది.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

దూసుకొస్తున్న కమలా హారిస్.. ఆందోళనలో ట్రంప్ || Rushing Kamala Harris.. Trump in concern

 

Nsnnews// చివరి క్షణాల్లో ఫలితాలు మారే అవకాశం.. దీంతో ముందంజలో ఉన్న కూడా జంకుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకోగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వేగం పుంజుకుని 179 ఎలక్టోరల్ స్థానాలు కైవసం చేసుకున్నారు.

Latestnews, Telugunews, Internationalnews, Donald Trump…

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ధర్నా || Tapas dharna of regional teacher union at Kamareddy district collectorate

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్మాగ్రహ దీక్ష లో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాఘవ రెడ్డి , భూనేకర్ సంతోష్ లు మాట్లాడుతూ : నూతన ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచిన ఆర్ధికపరమైన ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశలవారిగా ఉద్యమ కార్యచరణ లో భాగంగా ఈ ధర్నా చేపట్టడం జరిగిందని బకాయి పడ్డ 4 DAలను వెంటనే విడుదల చేయాలనీ, ఈ-కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని , PRC కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలని , 317 పరిష్కారం , సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమండ్ చేశారు. ఈ కార్యక్రమం లో తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్ర నాథ్ ఆర్య , కార్యదర్శి భాస్కరా చారి , జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ శివకాంత్ , జిల్లా బాధ్యులు లక్ష్మి పతి , భాస్కర్ , సంతోష్ , ఆంజనేయులు , దత్తా చారి , వేద్ ప్రకాష్, సత్యనారాయణ , శ్యామ్ , వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు , తపస్ బాధ్యులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latestnews, Telugunews, telangananews,

Kamareddynews…

తెలంగాణలో రెండు గంటలు పర్యటించనున్న రాహుల్ గాంధీ || Rahul Gandhi will visit Telangana for two hours

 

Nsnnews// తెలంగాణలో రెండు గంటలు పర్యటించనున్న రాహుల్ గాంధీ సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చి, 5:30 గంటలకు జరిగే కులగనన సదస్సులో పాల్గొననున్న రాహుల్ గాంధీ. అనంతరం 6:30 గంటలకు తిరిగి బేగంపేటకు పయనమై ఢిల్లీకి వెళ్ళిపోనున్న రాహుల్ గాంధీ.

Latestnews, Telugunews, Telangananews…

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న సీఎం హామీ నిలబెట్టుకోవాలి || The CM should keep his promise of regularizing the comprehensive punishment employees

 

Nsnnews// పడాల రవీందర్, MLC అభ్యర్థి -ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గం
కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి పర్మినెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తామన్న సీఎం హామీ నిలబెట్టుకోవాలి గత 15 సంవత్సరాల్లో విద్యావ్యవస్థలో కీలకంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మరియు ఇతర శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని కోరినప్రభుత్వం పట్టించుకోవడంలేదని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేనున్నానని పడాల రవీందర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా పర్యటనలో ఈరోజు కార్యక్రమంలో చైతన్యవంత కామారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ లో ఓటు నమోదు తక్కువగా ఉండటం చాలా ఆలోచించదగ్గ విషయం… యువత, గ్రాడ్యుయేట్ లు తక్షణమే మీ MLC ఓటు నమోదు చేయండి.హక్కును గా చేయండి. ప్రజా స్వామ్యం పరిరక్షణ కోసం BC, SC, ST వర్గాలకు,గ్రాడ్యుయేట్ లకు న్యాయం,కాంట్రాక్టు &ఔటసోర్సింగ్ ఉద్యోగుల, భద్రత &గ్రాడ్యుయేట్ యువత& ఉద్యోగ, ఉపాధ్యాయ, సభ్యండా కుటుంబ సభ్యులందరికీ సంక్షేమ ఫలాలు పొందుటకై మనం మన వానిని ఓటు నమోదు గా వినియోగించు కోవాలి మనం మన ప్రశ్నించే గొంతుక కి ఓటు వేద్దాం అంటూ ఈరోజు కామారెడ్డి జిల్లాకు విచ్చేసి, URS కామారెడ్డి, KGBV కామారెడ్డి, MRC కామారెడ్డి లో ఉపాధ్యాయ, ఉద్యోగులతో మాట్లాడుతూ పడాల రవీందర్ గారు ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన కోసం రావడం జరిగింది అని తెలిపారు అందులో భాగంగా మన కామారెడ్డి ఎస్ ఎస్ ఎ ఉద్యోగులందరినీ కలవడం జరిగింది మనకోసం మన ఓటు అనే కార్యక్రమం లో ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు రాములు,చిరంజీవి, లింగం, శ్రీనివాస, శైలజ మాధవి,భక్తమాల,మాధవి సాయిరెడ్డి, కవిత,శంకర్, కామారెడ్డి యూఆర్ఎస్ మరియు కి కేజీబీవీ ఎస్వోలు మిగతా ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36 వార్డు సామల కవిత దామోదర్ ఇంటి పక్కన ఆకుల నాగరాజు దాడి పాల్పడుతున్నారని ఆరోపించారు|| Akula Nagaraju is accused of attacking the house of Samala Kavitha Damodar in Ward 36 of Kamareddy Municipal.

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సామల కవిత దామోదర్. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులో సామల కవిత నాగరాజు కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి పక్కన గల ఆకుల నాగరాజు అతను భార్య వారి ఇద్దరు కుమారులు దాడి పాల్పడుతున్నారని ఆరోపించారు. 6 లక్షలు రూపాయలను ఇవ్వాలని ఆకుల నాగరాజు డిమాండ్ చేసారని అన్నారు. అందుకు నిరకరించడంతో మమల్ని ఇబ్బంది లకు గురిచేస్తున్నారు.ఇంటి పని చేసే మేస్త్రి లను బూతుమాటలతో తిట్టడం జరగగా ఎందుకు తిడుతున్నారని అడగడంతో నా పై ఆ నలుగురు దాడిచేసారు. అందుకే ప్రజావాణి లో పిర్యాదు చేశాము అన్నారు.ఇల్లు నిర్మించినప్పటి నుండి ప్రతిరోజు కావాలని గొడవ చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నిర్మాణం జరగకుండా చేస్తామని అంటున్నారని అన్నారు. నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్లీ నా దగ్గరికి రావాల్సిందేనని అంటున్నాడని అన్నారు. మా దగ్గర మేము ప్లాట్ కోన్నటువంటి ఇంటి పేపర్లు ఉన్నాయని దాని ప్రకారమే మున్సిపల్ నుండి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుందని దయచేసి జిల్లా కలెక్టర్ అధికారులు మాకు న్యాయం చేయగలరని, నాగరాజు ఫ్యామిలీ ద్వారా మాకు ప్రాణహాని ఉందని మాకు న్యాయం చేయాలని కోరారు.

Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…

మాజీ సర్పంచుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రులు హరీష్ రావు || Former ministers Harish Rao who supported the protest of ex-serpanchs

 

Nsnnews// మాజీ సర్పంచుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రులు హరీష్ రావు గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, డా. కల్వకుంట్ల సంజయ్ గారు. బలవంతంగా డీసీఎం వ్యానులో ఎక్కించి, తరలిస్తున్న మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమల గిరి రోడ్డుపైన నిరసన.

Latestnews, Telugunews, Telangananews, Politicalnews, Harish Rao…

 

మిరుదొడ్డి మండల నూతన తహసిల్దారుగా హరికిషన్ బాధ్యతలు చేపట్టారు || Harikishan took charge as the new tehsildar of Mirudoddi mandal

 

Nsnnews// మిరుదొడ్డి మండల నూతన తహసిల్దారుగా హరికిషన్ బాధ్యతలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్. ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన గోవర్ధన్ హైదరాబాద్ కు బదిలీపై వెళ్లడంతో, డిప్యూటీ తాసిల్దారుగా పనిచేస్తున్న వీరేశంకు బాధ్యతలు అధికారులు అప్పగించారు. ఇటీవల జరిగిన బదిలీలో సిద్దిపేట రూరల్ తహసిల్దార్ గా పని చేసిన హరికిషన్ కు మిరుదొడ్డి తహసిల్దార్ గా నియమించారు. నేడు తాసిల్దారుగా హరికిషన్ బాధ్యతలు తీసుకోవడంతో రెవెన్యూ సిబ్బంది తహసిల్దార్ కు పుష్పగుచ్చమిచ్చే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలవ్యాప్తంగా ఏవైనా భూ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ వీరేష్, ఆర్ ఐ రాజ్కుమార్, కొండల్ రెడ్డి,సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangananews, Siddipetnews…

స్టేజీపై తన పేరు చెప్పలేదని అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి || TDP MP Vemireddy Prabhakar Reddy who left after not saying his name on stage

 

Nsnnews// స్టేజీపై తన పేరు చెప్పలేదని అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగరంలోని ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశం స్టేజీపై అందరి పేర్లు చెప్పి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పని నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష. స్టేజీపై తనకు తగిన గౌరవం దక్కలేదని అలిగి వెళ్లిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కారు వరకు వెళ్ళి సముదాయించేందుకు ప్రయత్నించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

Latestnews, Telugunews, Apnews, Politicalnews… 

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని పోరుబాట కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లు || Former sarpanches who called for a struggle to release pending bills

 

Nsnnews// పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాట కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లు పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వచ్చిన మాజీ సర్పంచ్‌లు.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…