Home అంతర్జాతీయం Nepal Bus Accident: నేపాల్‌ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య || Nepal Bus Accident: Death toll reaches 41 in Nepal accident

Nepal Bus Accident: నేపాల్‌ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య || Nepal Bus Accident: Death toll reaches 41 in Nepal accident

0
Nepal Bus Accident: నేపాల్‌ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య || Nepal Bus Accident: Death toll reaches 41 in Nepal accident

 

Nsnnews// కాఠ్‌మాండూ: నేపాల్‌లో శుక్రవారం బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన పర్యటక బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా 43 మంది నేపాల్‌లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూకు బయలుదేరారు. తనహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో వెళుతుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం నేపాల్‌ వెళ్లనుంది.

Latest news,Telugu news,Road accident news,Kathmandu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here