Home క్రీడలు KKR vs RCB, IPL 2024: ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు.

KKR vs RCB, IPL 2024: ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు.

0
KKR vs RCB, IPL 2024: ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు.

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: ఆర్సీబీకి మళ్లీ నిరాశే ఎదురైంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ జట్టు కోల్ కతా చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట కోల్ కతా బ్యాటింగ్ చేసింది.

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: ఆర్సీబీకి మళ్లీ నిరాశే ఎదురైంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ జట్టు కోల్ కతా చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట కోల్ కతా బ్యాటింగ్ చేసింది. శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ, ఫిలిఫ్ సాల్ట్, రస్సెల్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. విల్ జాక్స్‌ ( 32 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్‌ ( 23 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించినా ప్రమోజనం లేకపోయింది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) , ప్రభుదేశాయ్‌ (24), గ్రీన్‌ (6) మహిపాల్‌ (4) తీవ్రంగా నిరాశ పర్చారు. ఆఖరులో దినేశ్‌ కార్తీక్‌ (24), శర్మ(20) మెరుపు ఇన్నింగ్స్ లు ఆడినా భారీ లక్ష్యం కావడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, సునీల్‌ నరైన్‌ చెరో 2, వరుణ్‌ చక్రవర్తి, స్టార్క్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు.

కాగా ఈ ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. అదృష్టం తోడైతే తప్ప ఆ జట్టు నాకౌట్ చేరుకునే అవకాశం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here