Nsnnews// ఆరోగ్య, జీవిత బీమ ప్రీమియాలపై 18 శాతంగా ఉన్న GSTని ఉపసంహరించుకోవాలని తృణముల్ కాంగ్రెస్ MP డెరెక్ ఓబ్రెయిన్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. త్వరలో జరిగే GST మండలి భేటీలో బీమా ప్రీమియంపై GST ఉపసంహరణ నిర్ణయం తీసుకోవాలని లేఖ రాశారు. బీమాపై పన్ను 45 కోట్ల మంది మధ్యతరగతి జనాభాపై ప్రభావం చూపుతుందని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. బీమా పథకాలు అనారోగ్యం, ప్రమాదం, ఆకస్మిక మరణాలు జరిగినప్పుడు ఆర్థిక భద్రతను ఇస్తాయని తెలిపారు. సామాజిక భద్రతను సమాజంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అధిక బీమా ప్రీమియం కారణంగా పౌరులు బీమా తీసుకోవడానికి వెనకాడుతున్నారని, ఇప్పటికే ఉన్నవారు వారి ప్రీమియాన్ని పునరుద్ధరించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బీమా ప్రీమియంపై GST సమీక్షించాలని రాసిన లేఖను TMC నేత ప్రస్తావించారు.
Latestnews, Telugunews, thrunamul Congress MP, Derek O’Brien, Nirmala Sitharaman…