Nsnnews// BCల కులగణన జరిగే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని.. PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. BC కులగణనపై హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన.. రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన మహేశ్ కుమార్ …కామారెడ్డి డిక్లరేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. BCల గణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ గా అభివర్ణించిన PCC అధినేత…ఈ అంశాన్ని రాహుల్ గాంధీ మినహా ఎవరూ ఎత్తుకోలేదని వివరించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత VH, BC వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ , ఇతర BC సంఘాల నేతలు హాజరయ్యారు.
Latest news,Telugu news,Telangana news,Politics news