Home బిజినెస్ Airasia : సినీ ప్రేమికులకు ఎయిరేషియా టికెట్లు! || Airasia : Airasia tickets for movie lovers!

Airasia : సినీ ప్రేమికులకు ఎయిరేషియా టికెట్లు! || Airasia : Airasia tickets for movie lovers!

0
Airasia : సినీ ప్రేమికులకు ఎయిరేషియా టికెట్లు! || Airasia : Airasia tickets for movie lovers!

 

Nsnnews// బెంగళూరు: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో సినీ ప్రేమికుల కోసం ఒక వినూత్న ‘సినిమాటిక్‌ ఇన్‌-ఫ్లైట్‌’ కార్యక్రమాన్ని ఎయిరేషియా మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తారు. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆసియా, ఆస్ట్రేలియాలలో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది. భారత్‌లోని 16 నగరాల నుంచి మలేషియా, థాయ్‌ల్యాండ్‌ల మీదుగా 130 గమ్యస్థానాలకు తన విమానాలను సంస్థ నిర్వహిస్తోంది. ‘క్యూబ్‌ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో 12 నగరాల్లో 130 థియేటర్ల ద్వారా ఎయిరేషియా తన గమ్యస్థానాల గురించి వివరిస్తుంద’ని చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ పాల్‌ కరోల్‌ పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సినీ ప్రేమికులు ఎయిరేషియా టికెట్లను గెలుచుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తద్వారా తమ నెట్‌వర్క్‌లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

Latest news,Telugu news,Business news…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here