Home జాతీయం హైదరాబాద్‌ జూలో బెంగాల్ టైగర్ మృత్యువాత…

హైదరాబాద్‌ జూలో బెంగాల్ టైగర్ మృత్యువాత…

0
హైదరాబాద్‌ జూలో బెంగాల్ టైగర్ మృత్యువాత…

 

Nsnnews// హైదరాబాద్ : మే 15
హైదరాబాద్‌ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం సాయంత్రం మృత్యువాత పడింది.

తొమ్మిదేళ్లప్రాయం ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు.

ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉన్న అభి మన్యుకు అన్ని రకాల వైద్యసేవలు జూ” వెటర్నరీ విభాగం అధికారులు అందించడంతో పాటు వీబీఆర్‌ఐ, వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు.

ఈ నెల 12న అభిమన్యు ఆహారం తీసుకోలేదు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్లపులులు 8 ఉన్నాయి.

Latest News , Telugu News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here