Nsnnews// రావురుకుల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1998-99 విద్యాసంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నవంబర్ 9న ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాలతో గడిపారు.
ఈ సమ్మేళనానికి ఆ తరగతి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కూడా విచ్చేసి, పూర్వ విద్యార్థులతో సందడి చేశారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో జ్ఞాపకాల జ్ఞాపికలుగా ఉన్న చిన్ననాటి సంఘటనలను, ఆడిన ఆటలు, చేసుకున్న స్నేహాలను తిరిగి గుర్తు తెచ్చుకుంటూ నవ్వులు పంచుకున్నారు.
Latestnews, Telugunews, get together programme, zphs school. . .