Nsnnews// రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సామజిక, విద్యా, ఉగ్యోగ, రాజకీయ మరియు కుల గణనలో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో నిర్వహించిన సర్వేను బుధవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేకు క్షేత్రస్థాయిలో ఏమైనా ఉన్నాయా అని సిబ్బందిని అడిగి సర్వే చేస్తున్న తీరును పరిశీలించి ఇంటి యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. ఈరోజు నుండి 8 తారీకు మూడు రోజులు హౌస్ సర్వే నిర్వహించి యజమానుల పేర్లను నమోదు చేసి ఇంటింటికీ స్టిక్కర్ అతికించడం జరుగుతుందని, 9వ తేదీ నుండి ప్రభుత్వం రూపొందించిన నిర్దిష్టమైన ఫారంలో ఇంటిలోని ప్రతి ఒక్కరి సమగ్ర సామాజిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ మరియు కులగణన నిర్వహించడం జరుగుతుందని ప్రజలు మీకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీ వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని అన్నారు. ఇంటింటి సర్వే చేసేందుకు జిల్లాలలో 2538 మంది ఎన్యూమరేటర్లను, 252 మంది సూపర్వైజర్లను నియమించడం జరిగిందని ఈ సర్వేను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీలు, నియోజకవర్గంలో స్థాయిలో ప్రత్యేక అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు మరియు జిల్లా ఓవరాల్ గా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఈనెలాఖరులోగా సర్వే పూర్తి చేసి ఏరోజుకారోజు సర్వే వివరాలను ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ తాసిల్దార్ వెంకట్ రెడ్డి, సర్వే సూపర్వైజర్, ఎన్యూమరేటర్ ఉన్నారు.
Latestnews, Telugunews, Telangananews, Siddipetnews..