Home చదువు యూనివర్సిటీల్లో ప్రక్షాళన షురూ.. సీఎం రేవంత్ ఆదేశాలు || Cleanliness in universities.. CM Revanth’s orders

యూనివర్సిటీల్లో ప్రక్షాళన షురూ.. సీఎం రేవంత్ ఆదేశాలు || Cleanliness in universities.. CM Revanth’s orders

0
యూనివర్సిటీల్లో ప్రక్షాళన షురూ.. సీఎం రేవంత్ ఆదేశాలు || Cleanliness in universities.. CM Revanth’s orders

 

Nsnnews// చాన్సలర్ పోస్టులకు ఎటువంటి ప్రభావం లేకుండా, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపికలు జరిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్, వీసీలకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఉన్నత విద్యా మండలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంచడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించారు. గడిచిన పదేళ్లలో ఉన్నత విద్యా వ్యవస్థను పునరుద్ధరించడం అవసరం అని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్తగా నియమితులైన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డితోపాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. చాన్సలర్ పోస్టులకు ఎటువంటి ప్రభావం లేకుండా, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపికలు జరిపినట్లు సీఎం స్పష్టం చేశారు. చైర్మన్, వీసీలకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. గతంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీసీల మాదిరిగా, నేటి వీసీలు కూడా విద్యారంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.

యూనివర్సిటీల ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయాలని, అవసరమైతే కన్సల్టెన్సీల సేవలు పొందాలని సూచించారు. వర్సిటీలకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను పెంచే చర్యలను చేపట్టాలని సలహా ఇచ్చారు. వీసీలకు స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని చెప్పారు. అయితే, తప్పు జరిగితే తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సైతం వీసీలపై ఉంచారు. ముఖ్యంగా యూనివర్సిటీలలో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాంటి విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ద్వారా సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. యూనివర్సిటీలను నూతన దిశగా తీసుకెళ్లడం ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి పునాదులు వేయాలని విసిలకు సూచించారు సీఎం.

Latest news, Telugu news, Telangana news, CM Revanthreddy..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here