Nsnnews// మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు నాసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో దీపావళి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది.పేకాట కోసం తండ్రి కర్రే సాయిలు ను కొడుకు కర్రే హన్మాండ్లు డబ్బులు అడగగా డబ్బులు ఇవ్వక పోవడంతో తాగిన మైకంలో వ్యవసాయానికి వాడే పని ముట్టు కొంకితో కుమారుడు హన్మాండ్లు తండ్రి తల పై మోది హత్య చేశాడు.తీవ్ర రక్తస్రవంతో సాయిలు అక్కడి అక్కడే మృతి చెందడం జరిగిందని స్థానికులు తెలిపారు.నసురుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సాయి మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించారు.
Latestnews, Telugu news, Telangana news, Kamareddy news, Crime news..