Nsnnews// కలెక్టర్ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ డా.అనురాధ తో సంబంధిత శాఖల అధికారులతో డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశ నిర్వహించి జిల్లాలో రహదారి భద్రతపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ, రాష్ట్ర ఇతర అన్ని రకాల రహదారులలో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా నివారించేందుకు తగు భద్రత చర్యలను తీసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖ వారితో కలిసి ఆర్ అండ్ బి మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లాలోని జాతీయ రహదారులు మరియు ఇతర ప్రధాన రహదారులను కలిపే ప్రాంతాలలో ఆయా శాఖల రహదారులను పరిశీలించి స్పీడ్ బ్రేకర్లు లేని వద్ద కచ్చితంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. రహదారుల్లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రమాద సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గుంతలను పూడ్చాలని అన్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రహదారి పనులు జరుగుతున్న ప్రాంతాలలో వాహనదారులు ఇబ్బంది పడకుండా డైవర్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, రాజీవ్ జాతీయ రహదారిపై బ్లింకింగ్ లైట్లు అన్ని పనిచేసేలా చూడాలని, రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన మొక్కల కొమ్మలను కత్తిరించి తొలగించాలని, దుద్దెడ, కుకునూరుపల్లి, గౌరారం, వంటిమామిడి గ్రామాల వద్ద ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా రెయిలింగ్ సీడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నిబంధనల మేరకే రహదారుల నుండి నిర్దేశిత దూరం పాటించి వైన్ షాప్ లు ఉండేలా చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలలో ప్రయాణికులు దిగడానికి మరియు ఎక్కడానికి ఆర్టీసీ బస్సులను కచ్చితంగా రోడ్డుకు ప్రక్కననే ఆపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ప్రయాణికులు వాహనదారులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండడం మూలంగా రహదారి ప్రమాదాలను నివారించవచ్చని పోలీస్ శాఖ వారు సూచించే నియమ నిబంధనలను డ్రైవర్లు తప్పక పాటించాలని అన్నారు. రోడ్లను దాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రయాణికులకు, వాహనాలు నరిపేట తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుటకు అందరు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. అన్ని పాఠశాలలలో గల యాంటీ డ్రగ్ కమిటీలు విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన చర్యలు చేపట్టాలని అన్నారు. మద్యపానం, ధూమపానం ఇతర డ్రగ్స్ కు అలవాటయినా ప్రజలను గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గల డి అడిక్షన్ సెంటర్కు పంపి చికిత్స అందించాలని అన్నారు. మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రలితాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట సబ్ జైల్లో లో ఖైదులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మరియు వారికి కలిగిన హక్కులు, న్యాయ సహాయం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాస్ మూర్తి, జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు, ఏసీపిలు మధు, పురుషోత్తం, సతీష్, సుమన్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, మురళి, కోర్ట్ మానిటర్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, జైల్స్, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Latest news, Telugunews, Telangananews, Siddipet news..