Home క్రైమ్ శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువు దోపిడీ.. || Vertical robbery of devotees in Sri Boyakonda Gangamma temple..

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువు దోపిడీ.. || Vertical robbery of devotees in Sri Boyakonda Gangamma temple..

0
శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువు దోపిడీ.. || Vertical robbery of devotees in Sri Boyakonda Gangamma temple..

 

Nsnnews// చౌడేపల్లి మండలం అటవీ ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తులను నిలువునా దోచేస్తున్నారని మండిపడుతున్నారు..

ఈ సందర్భంగా ఈరోజు కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనార్థం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం గాలివీడు గ్రామం వడిసి వంక పల్లి గ్రామం నుంచి సురేష్ రెడ్డి .హరనాథ్ రెడ్డి.జానీ మరియు వారి కుటుంబ సభ్యులు మిత్రుల తో అమ్మవారి మొక్కు తీర్చకొనేందుకు రావడం జరిగింది.అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించే పొట్టేళ్ల రుసుములో వివాదం చోటుచేసుకుంది.నాలుగు వందల రూపాయల ధరను మూడు వేలు వసూలు చేస్తున్నారని భక్తులు నిలదీయడంతో భక్తులపై గుత్తేదారులు 30 మంది ఒక్కసారిగా ముక్కు ఉమ్మడిగా దాడి చేసి భక్తులను తీవ్రంగా గాయపరిచారు. భక్తుల్లో ఒకరు ఆర్మీ జవాన్ ని కూడా చితకబాదారు.కాళ్ళు పట్టుకున్న వారి గ్యాంగ్ కనికరం చూపకుండా భక్తులను తీవ్రంగా చితకబాదారు.ఈ ఘటన పై భక్తులు ఆలయ ఈవో.ఏకాంబరం దృష్టికి తీసుకెళ్లారు. భక్తులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీప బంధువులు కావడంతో ఈవో ఏకాంబరం గుత్తేదారులను పిలిపించి క్షమాపణలు చెప్పించారు.అలాగే వైద్య ఖర్చులు నిమ్మితం భక్తులకు 50వేలు గుత్తేదారుల నుంచి ఇప్పించడం జరిగింది.ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పుంగనూరు నియోజకవర్గంలో రెండ్ బుక్ రాజ్యాంగం రాజ్య మేలు తుంది చివరికి వీరి ఆగడాలు గతంలో బోయకొండ గంగమ్మ ఆలయంలో టెండర్లు ఎత్తుకొన్న వారిని తన్ని తరిమేసి ఇలాంటి దౌర్జన్యాలకు తెగబడుతున్నారు సాక్షాత్తు మంత్రి బందువులకే దిక్కు లేదంటే ఇంక సామాన్య భక్తులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గనించవచ్చు

Latest news, Telugu news, AP news, Chittur news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here