Nsnnews// రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు. ఉత్తర రింగు రోడ్డు చౌటుప్పల్ వద్ద ముగుస్తుండడంతో, చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్చేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది.. కానీ ఇక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉండడంతో, ప్రభుత్వం భూముల విలువ తక్కువగా కట్టించి ఇవ్వడంతో, ఈ ఇంటర్చేంజ్ స్ట్రక్చర్ ను చౌటుప్పల్ పట్టణానికి దూరంగా నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కొందరు నేతలు కలిసి ఒత్తిడి తెచ్చారు.
మరోవైపు సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద RRR ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉండగా, రైతులు భూములు ఇవ్వడం లేదు.. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నేతలు తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగ్ రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో అలైన్‌మెంట్ మార్చాలని ప్రతిపాదనలు తెస్తున్నారు. యాదాద్రి జిల్లాలో రింగ్ రోడ్డు గురించి రైతులు భూములు ఇవ్వమని భూసేకరణను అడ్డుకుంటున్నారు.. దీంతో కొందరు నేతలు రైతుల భూముల్లో నుండి RRR వెళ్లొద్దని అలైన్‌మెంట్ మార్చమని ప్రతిపాదిస్తున్నారు….
Latest news, Telugu news, Telangana news..