Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. ఓ ఆస్పత్రి నుంచి లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ మిషన్‌ను శుక్రవారం సాయంత్రం కారులో వేరే చోటకు తరలిస్తుండగా రైల్వే గేటు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, వైద్యాధికారుల విచారణలో మరొక స్కానింగ్ మిషన్ కూడా ఉందని కారు డ్రైవర్ చెప్పగా దానిని కూడా అధికారులు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతుండగా ఇటీవల కేసులు కూడా నమోదయ్యాయి. శుక్రవారం స్కానింగ్ మిషన్‌తో దొరికిన కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్డీవో, ప్రోగ్రాం ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో గతంలో సీజ్ చేసిన ఓ ఆస్పత్రి పక్క భవనంలో దాచిన మరొక స్కానింగ్ మిషన్‌ను సీజ్ చేశారు. మిషన్లు సీజ్ చేసిన సమయంలో ప్రముఖ వైద్యుడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు, వైద్యాధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సంబంధిత స్కానింగ్ మిషన్ ఇట్టం సిద్దిరాములుకు సంబంధించినదిగా జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు.
Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…