Nsnnews// మూసీ ప్రక్షాళన చేయాలా? వద్దా అనే విషయంపై BJPస్పష్టతనివ్వాలని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు…. ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయిస్తే యాత్రల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక ఘటన ఆధారంగా…. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని BRS నేతలు చెప్పడం వల్లే… సర్కార్ ను కాపాడుతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారని మహేష్ కుమార్ తెలిపారు.
Latestnews, Telugunews, Hyderabadnews, MaheshKumar Goud…