Nsnnews// నెక్ ఫైబ్రో లైపోమాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆసుపత్రి వైద్యుల అరుదైన ఆపరేషన్ చేశారు. డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలోని.. డాక్టర్లు రఘు, రాఘవేంద్ర,సిబ్బంది గంటన్నరపాటు శ్రమించి.. మూడున్నర కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ వివరాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డికి చెందిన సిద్ధిరాములు… గత కొంతకాలంగా మెడకు పెద్ద కణితితో బాధపడుతూ.. దుబ్బాక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో చేరినట్టు చెప్పారు.
Latestnews, Telugu news, Telangananews, Siddipet news..