Nsnnews// నేటి నుండి ప్రారంభమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి,తీవ్ర ఉత్కంఠ మధ్య నిర్వహిం చిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 27 పరీక్ష కేంద్రాలను మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్ష 17,779 మంది అభ్యర్థులు రాయా ల్సి ఉండగా, 12,000 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగితా 5779 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
అభ్యర్థులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంటన్నర వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఒంటి గంటన్నరకు గేట్లు మూసి వేశారు. కొన్ని చోట్ల ఆల స్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులకు అధికారులు అనుమతిం చకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అధికారులు విధించిన నిబంధనలు పాటించాలని పరీక్షా కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లో ఈ పరీక్షలు నిర్వహిం చారు. ఇందుకోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో కెమెరాలను అమర్చారు.
పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను కూడా మూసివేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా పరీక్ష నిర్వహించవద్దని చేస్తున్న ఆందోళనల వల్ల ప్రతి కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహించిన ఇన్విజిలేటర్లు, ఇతర అధికారుల ఫోన్లను సైతం పరీక్ష హాల్ లోకి అనుమ తించలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను సజావుగా నిర్వహించారు.
Latestnews, Telugunews, Group 1 mains exams, Telangana news..