Nsnnews// మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ pacsలో రుణాల మంజూరు, రుణమాఫీ విషయంలో అక్రమాలు జరిగాయంటూ.. రైతులు ఆందోళనకు దిగారు. రుణాలు తీసుకోకపోయినా తీసుకున్నట్లు చూపించడం, ఆధార్ అనుసంధానంలో తప్పులు, చనిపోయిన రైతుల పేరిట రుణాలు ఉండటం, చాలామంది రైతులకు రుణమాఫీ అందకపోవడంపై సీఈఓ ఆశన్న సహా సిబ్బందిని రైతులు నిలదీశారు. ఓ దశలో సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేసే ప్రయత్నం చేశారు. ఛైర్మన్ లక్ష్మినారాయణతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు స్వల్వ ఉద్రికత పరిస్థితి తలెత్తింది. చనిపోయిన వారిపై రుణాలు ఇచ్చారన్న ఆరోపణల్ని సీఈవో కొట్టిపారేశారు. ఆధార్ సీడింగ్ తో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న ఆయన వాటిని సవరించినట్లు చెప్పారు. రైతులు చేస్తున్న ఇతర ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. అనుమానాలున్న అన్నదాతలు.. కార్యాలయానికి వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
latestnews, telugunews, telangananews….