Nsnnews// ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ 21మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితా విడుదల చేసింది. ఆర్థికమంత్రి రామేశ్వర్ ఓరాన్ .. లోహర్దగా నుంచి బరిలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ లలో పార్టీ ఇన్ ఛార్జ్ అజోయ్ కుమార్ జంషెడ్ పూర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఝార్ఖండ్ మాజీ పార్టీ చీఫ్ .. ఓరాన్, షిప్లి నేహా టిర్కీ మందార్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ సహా… సీనియర్ నేతల సమక్షంలో అభ్యర్థులను ఫైనల్ చేశారు. 81అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్ కు… నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ ,. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు.. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ , JMM,ఆర్జేడీ, వామపక్షాలు.. స్థానాల సర్దుబాటుపై అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ 29, JMM 41,ఆర్జేడీ 7, లెఫ్ట్ పార్టీలు 4 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
latestnews, jharkhandnews, telugunews, jharkhand elections….