Nsnnews// చైనా మంచు రాజధాని జిన్ జియాంగ్ ప్రాంతం స్కీయింగ్ పర్యాటకులతో కళకళలాడుతోంది. అల్టేలోని కోక్టోకే ఇంటర్నేషనల్ స్కీ రిసార్ట్ కు స్కీయింగ్ ప్రేమికులు తరలి వస్తున్నారు. చైనాలో 3వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఆల్పైన్ స్కీ రిసార్ట్ … మంచు పర్వతాల మధ్యలో ఉంది. ఈ మంచు సీజన్ దాదాపు ఎనిమిది నెలలు వరకు ఉంటుంది. సందర్శకులను అలరించడానికి యువతను ఆకట్టుకోవడానికి మంచు క్రీడలను అక్కడి యంత్రాంగం ఏర్పాటు చేసింది. మంచుపై జారుతూ అబ్బుర పరిచే స్కీయింగ్ విన్యాసాలతో చైనీయులు అలరిస్తున్నారు. భూతల స్వర్గంగా పిలిచే ఇక్కడి పర్యావరణం, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు.
latestnews, internationalnews, SkiResort china…