Home జాతీయం ఆర్‌జే కంటి ఆసుపత్రి ప్రారంభించిన మోడీ || pm modi announces projects worth rs 6700 in varanasi

ఆర్‌జే కంటి ఆసుపత్రి ప్రారంభించిన మోడీ || pm modi announces projects worth rs 6700 in varanasi

0
ఆర్‌జే కంటి ఆసుపత్రి ప్రారంభించిన మోడీ || pm modi announces projects worth rs 6700 in varanasi

 

Nsnnews// భారత్‌ ఆరోగ్య వ్యూహాలు ఐదు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని… ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ప్రివెంటివ్‌ హెల్త్ కేర్‌, సకాలంలో వ్యాధి నిర్ధారణ, ఉచిత, చౌకమైన చికిత్స, చిన్నచిన్న పట్టణాల్లో మెరుగైన వైద్యంలతో పాటు.., వైద్యుల కొరతను భర్తీ చేయడం, వైద్యరంగంలో సాంకేతిక విస్తరణ వంటి ఐదు స్తంభాలను భారత్ కలిగి ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంతనియోజక వర్గంలోని వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఆర్‌జే శంకర కంటి ఆస్పత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో 6,700 కోట్లతో పలు అభివృద్ధికి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ… శంకర ఆస్పత్రి వల్ల యూపీతోపాటు మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ర్టాల్లోని మెుత్తం 20 జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఈ ఆసుపత్రి రాకతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కాశీ.. ఇకపై ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసలు కురిపించారు. భగవంతుని ఆశీస్సుల వల్లే మోదీ లాంటి మంచి నేతలు వచ్చారని, ఆయన ద్వారా భగవంతుడు ఎన్నో మంచి పనులు చేయిస్తున్నారని అన్నారు. వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించిన సందర్భంగా… విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనను ‘నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్‌’ అని విజయేంద్ర సరస్వతి స్వామి అభివర్ణించారు. ఇది భద్రత, సౌఖ్యం, పౌరుల క్షేమంపై దృష్టిసారించిన గొప్ప పాలన అని అన్నారు. మోదీ పాలన ప్రపంచానికే ఒక ‘రోల్ మోడల్’గా నిలిచిందని, సాంస్కృతిక పునరుజ్జీవనంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు సోమ్‌నాథ్, కేదార్‌నాథ్‌లే ఉదాహరణలని స్వామీజీ చెప్పుకొచ్చారు.

Latest news,Telugu news,National news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here