Nsnnews// భారతీయ జనతా పార్టీ…సక్రియ సదస్యతా అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వం ఇచ్చేందుకు…బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు ప్రధాని మోదీ…మొదటి క్రియాశీలక సభ్యునిగా పేరు నమోదు చేసుకున్నారు. BJP అధ్యక్షుడు JPనడ్డా, ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ప్రధాని మోదీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. బీజేపీ కార్యకర్తగా…మొదటి సక్రియ సదస్యతా అభియాన్ లో సభ్యునిగా చేరటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రతి సభ్యుడు కనీసం 50మందిని…బూత్ స్థాయిలో కాని నియోజకవర్గస్థాయిలో కాని పార్టీ సభ్యులుగా చేర్పించాలని BJP సూచించింది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో…క్రియాశీలక సభ్యులు మాత్రమే పాల్గొంటారని బీజేపీ పేర్కొంది.
Latest news,Telugu news,National news