Home చదువు సర్కార్ కొలువుల ప్రభంజనుడు || Narra Rajkumar Qualified in 6 Govt Jobs…

సర్కార్ కొలువుల ప్రభంజనుడు || Narra Rajkumar Qualified in 6 Govt Jobs…

0
సర్కార్ కొలువుల ప్రభంజనుడు || Narra Rajkumar Qualified in 6 Govt Jobs…

 

Nsnnews// సిద్దిపేట రూరల్: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి..కన్న తల్లిదండ్రులకు, పెరిగిన ఊరికి వన్నె తెచ్చాడు ఓ యువకుడు. ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉన్న ప్రస్తుత కాలంలో ఏకంగా ఆరు సర్కార్ కొలువులు పట్టుదలతో సాధించి వారే వా అనిపిస్తున్నాడు.సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరుకు చెందిన నర్రా లక్ష్మీ రాజయ్య దంపతుల కుమారుడు నర్రా రాజ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు.అనుకున్నాదే లక్ష్యంగా పట్టువీడని విక్రమార్కుడిలా విజయం సాధించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు.2019లో పంచాయతీ కార్యదర్శిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేష్, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. వీఆర్వోపరీక్ష రాసి విజయం సాధించి, కొండపాక గ్రామ రెవెన్యూ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. 2021లో గ్రూప్ 4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెవిన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా మెదక్ జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడు. మరోవైపు మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ గా కొలువు దీరాడు. తల్లి దండ్రుల ప్రేరణ,ఉపాధ్యాయుల ప్రోత్సహంతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్టు రాజ్ కుమార్ తెలిపాడు. ఐఏఎస్ సాధించాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తానని పేర్కొన్నాడు.ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నర్రా రాజ్ కుమార్ ను పలువురు అభినందించారు.

Latestnews, Telugunews, Siddipet Rural, Pullur ,Narra Rajkumar,6 Govt Jobs..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here