Home తెలంగాణ మండుతున్న ధరలు…సామాన్యుడిపై భారం | Vegetable Price Hike Continues ,Tomato Prices

మండుతున్న ధరలు…సామాన్యుడిపై భారం | Vegetable Price Hike Continues ,Tomato Prices

0
మండుతున్న ధరలు…సామాన్యుడిపై భారం | Vegetable Price Hike Continues ,Tomato Prices

 

Nsnnews// సామాన్యుడిపై మరో భారం పడింది. పండుగ వేళ మార్కెట్‌లో కూరగాయాల ధరలు ఆకాశన్నంటాయి. గత కొంతకాలంగా ఉల్లి ధరలు పెరుగుతుండగా.. తాజాగా, టమాట ధరలు సైతం ఒక్కసారిగా చుక్కలనంటాయి.

అసలే పండగ సీజన్ కావడంతో పాటు ఆపై ధర పెరిగిపోవడంతో ఏం తినాలోనని వాపోతున్నారు జనం. ఎక్కడ చూసినా కిలో టమాట ధర 80కంటే తక్కువగా దొరకడం లేదు. రెండు రోజుల క్రితం 50లోపు ఉన్న ధర ఇప్పుడు.. ఒక్కసారిగా డబుల్ అయిపోయాయి. టమాట లేనిదే దాదాపు ఎవరింటిలోనూ కూడా వంట పూర్తి కాదు. వెజ్, నాన్ వెజ్ ఏం వండినా టమాట ఉంటే.. ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. కుటుంబానికి సరిపడేలా వంటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు టమాట వందకు చేరుకోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. కొందరు చింతపండును వినియోగిస్తుంటే.. మరికొందరు నిమ్మకాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వాతావరణ పరిస్థితులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ పండించే పంట పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి దిగుబడి పూర్తిగా పడిపోయింది. అయితే, మదనపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే టమాట ఒక్కసారిగా తగ్గిపోవడంతో పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు 50 వరకు ఉండే టమాట ధరలు… ఇప్పుడు ఏకంగా 100కు చేరువవుతున్నాయి. కాగా, ఉల్లిగడ్డల ధరలు కూడా ఆ స్థాయిలోనే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి సరిపడా సరకు రాకపోవడంతో ఉల్లి రేటు పెరిగిపోతోంది. అది కూడా క్వాలిటీ ఉండటం లేదన్నది వినియోగదారులు చెబుతున్నారు. వర్షాలు, వరదలకు ఇతర రాష్ట్రాల్లో టమాట, ఉల్లి దిగుమతులు తగ్గడంతో… ఏపీ, తెలంగాణలో డిమాండ్ ఏర్పడింది.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here