Nsnnews// ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలేని కాంగ్రెస్..డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని…దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల దృష్ట్యా..మహిళలు, సందర్శకులకు ఇబ్బందులు కల్గకుండా…చెరువు కట్టలు, బతుకమ్మ ఘాట్ వద్ద…ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. లైటింగ్ ఏర్పాటు చేసి, చెరువు కట్టలను సుందరికరించాలని చెప్పారు. 9నెలల కాంగ్రెస్ పాలనలో.. రాష్ట్ర పరిపాలన గాడితప్పిందన్న ఎమ్మెల్యే…పరిపాలన వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. నటి సమంతపై మహిళా మంత్రి అయినా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో కించపర్చే పోస్ట్‌లు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఉంటే.. ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ డైవర్శన్ పాలిటిక్స్, డ్రామాలు బంద్ చేయాలని కొత్త ప్రభాకర్ హితవు పలికారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై…కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
Latest news,Telugu news,Telangana news,Politics news,Siddipet news