Home బ్రేకింగ్ నేడు సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ || TTD laddu adulteration dispute hearing in Supreme Court today

నేడు సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ || TTD laddu adulteration dispute hearing in Supreme Court today

0
నేడు సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ || TTD laddu adulteration dispute hearing in Supreme Court today

 

Nsnnews// తిరుమల లడ్డూ వ్యవహారం మరింత ముదురుతోంది. అటు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో విచారణ ప్రారంభమైంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ జరుగనుంది.

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు…, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగనుంది. అయితే సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై తన వైఖరి తెలియజేయనుంది కేంద్రం. తన పిటిషన్‌పై పార్టీ-ఇన్-పర్సన్‌గా స్వయంగా వాదనలు వినిపించనున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి. కాగా, ఈ లడ్డూకు సంబంధించిన రెండు పిటిషన్లు నిన్న సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. ఈ రెండు నెంబ‌ర్ల‌లో జాబితా అయిన కేసులు నిన్న మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌గాల్సి ఉండేది.  అయితే అదే స‌మయంలో సొలిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వేరే కోర్టులో ఉండ‌టంతో… మొద‌టి కేసుగా ఈ పిటిష‌న్ల‌ను ఇవాళ విచారించాల‌ని ఆయ‌న త‌రపు న్యాయ‌వాదులు అభ్య‌ర్థించారు. అందుకు ధ‌ర్మాసనం అంగీక‌రించి, విచారణ‌ను ధ‌ర్మాస‌నం ఇవాళ విచారణ చేపట్టనుంది.

Latest news,Telugu news,Andhra Pradesh news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here