Nsnnews// రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, రజనీకాంత్ గత రాత్రి ఆసుపత్రిలో చేరడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రజనీకి ఏమైందో తెలియకపోవడంతో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఇవాళ చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది.
Latest news,Telugu news,National news