Nsnnews// సకాలంలో పూర్తి రుణమాఫీ చేయాలంటూ…కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులు మహా ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా..ప్రభుత్వం తమను మోసం చేస్తుందని రైతులు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్వవహారిస్తున్న ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ…సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా..ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్..రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేసినట్టు చెప్పుకుంటున్న ప్రభుత్వం…పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి చిత్తశుద్ది చాటుకోవాలన్నారాయన.
Latest news,Telugu news,Telangana news,Kamareddy district