Nsnnews// నిత్యం చెరువులోకి వచ్చి చేరుతున్న వ్యర్థాల కారణంగా..సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 32వ వార్డు కాలనీ ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. వ్యర్థాల కారణంగా మురుగు నీరు నిల్వ ఉండటంతో..దుర్గంధం వెదజల్లుతుంది. నెలలు గడుస్తున్న మురుగు నీటీని తొలగించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నిండుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారులు స్పందించి..చెరువును శుద్ది చేయాలని స్థానిక కాలనీ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ కార్యాలయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన..తమకేమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము నిత్యం మురుగు నీటీతో సహజీవనం చేయాల్సి వస్తోందని..ప్రజలు వాపోతున్నారు. అధికారులు ఇప్పటీకైనా స్పందించి..చెరువు శుద్ది చేపట్టి..తమను రోగాల భారీ నుండి కాపాడాలని వేడుకుంటున్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news