Nsnnews// బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహనీయుడు.. కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు..ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన..కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని..పద్మశాలి సంఘం నాయకులతోమ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. తెలంగాణ తొలి ఉద్యమకారుడి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. బాపూజీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను.. పద్మశాలి సంఘం నాయకులు, సభ్యలు సత్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్, ఆ కులసంఘం సభ్యులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news