Nsnnews// తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ129వ జయంతి వేడుకలు నిర్వహించారు. సీఐటీయూ, ఎస్ఎఫ్‌ఐ నాయకలు..వీరవనిత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా..ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడారు. ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిన ఐలమ్మ..భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం.. నిజాం నిరంకుశత్వ పాలనను వ్యతిరేకించిందన్నారు. వీరవనిత పోరాటం కారణంగానే.. నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంలో తెలంగాణ సంస్థానాన్ని విలీనం చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో.. సీఐటీయూ మండల అధ్యక్షుడు, కార్యదర్శిలతో పాటు..డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Latest news,telugu news,telangana news,Siddipet news