Nsnnews// బీసీ కులగణన కోసం వెంటనే కార్యచరణ ప్రారంభించి… వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు సచివాలయంలో సీఎంను కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధివిధానాలపై.. ముఖ్యమంత్రితో కమిషన్ ఛైర్మన్, సభ్యులు చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై… సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి విధానాలను పరిశీలించాలని తెలిపారు. బీసీ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు.. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.
Latest news,Telugu news,Telangana news