Nsnnews// ఉక్రెయిన్ , పశ్చిమాసియాల్లో శాంతిస్థాపన సాధ్యమేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి 79వ వార్షిక సర్వప్రతినిధి సభలో.. అమెరికా అధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేసిన ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై తలపెట్టిన యుద్ధం విఫలమైందన్నారు. ఉక్రెయిన్ ఇప్పటికీ స్వేచ్ఛగా ఉందన్న బైడెన్ .. రష్యా దండయాత్ర నేపథ్యంలో కీవ్ కు…అమెరికాతోపాటు మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. పూర్తిస్థాయి యుద్ధం ఎవరికీ ఉపయోగకరం కాదని చెప్పారు. హింసను పెంచుకుంటూ పోవడంకన్నా…దౌత్యపరమైన పరిష్కారమే శాంతికి మార్గమని పేర్కొన్నారు. సుడాన్ లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.
Latest news,Telugu news,International news