Nsnnews// జానీమాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలజడి సృస్టిస్తున్నాయని పుష్ప-2 చిత్ర నిర్మాత మైత్రి రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మత్తువదలరా-2 విజయోత్సవ సమావేశంలో పాల్గొన్న నిర్మాత..ఆ వివాదంలో బన్నీకి ఏ సంబంధం లేదని స్పష్టంచేశారు. పుష్ప 2 చిత్రం కోసం మొదటి నుంచి ఆ యువతి పనిచేస్తోందని.. సినీ పరిశ్రమలో ఏ వివాదం నెలకొన్నా చిత్ర బృందానికి ముడి పెట్టొద్దని సూచించారు. పుష్ప-2 చిత్ర విడుదల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నా ఆయన.. దేవర తరహాలోనే ఏపీ ప్రభుత్వానికి టికెట్ ధరల పెంపు కోసం.. దరఖాస్తు చేసుకుంటామని రవిశంకర్ వివరించారు.
Latest news,Telugu news,National news,Cinema news